కర్నూలు(Kurnool) శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో బస్సు దగ్డమైన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో 20మందికి పైగా సజీవదమనమయ్యారు. ఈ ఘటనపై హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) తాజాగా స్పందించారు. ఈ ఘటన వార్త విని తన గుండె తరుక్కుపోయిందన్నారు. మరణనాకి ముందు వాళ్లు పడిన వ్యథ తలుచుకుంటేనే గుండె పగిలిపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘కర్నూలు ప్రమాద వార్త విని నా హృదయం ముక్కలైంది. ఎంతో బాధపడ్డాను. మండుతున్న బస్సు లోపల ఆ ప్రయాణికులు అనుభవించిన బాధ వర్ణనాతీతం. కాలిపోయే ముందు వాళ్ల బాధ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇందులో చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని రష్టిక చెప్పుకొచ్చింది.

