కలం, కరీంనగర్ బ్యూరో: ప్రముఖ అంజనేయస్వామి పుణ్యక్షేత్రం అయిన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు (Kondagattu)లో గత నెలలో అగ్ని ప్రమాదం జరిగి లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అందించాలని జిల్లా మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి కొండగట్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజా ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ప్రమాద ఘటనను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. జిల్లా అధికారుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించడంతో బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.83.12 లక్షలు, విద్యుత్ సంస్థ నుంచి రూ.29 లక్షలు, డీఆర్డీఓ ద్వారా మరో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కొండగట్టు (Kondagattu) ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ యథావిధిగా వ్యాపారం చేసుకునేలా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
Read also: కరీంనగర్ కు ‘‘ఆయుష్‘‘ మంజూరు
Follow Us On: Twitter


