కలం, మెదక్ బ్యూరో: క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతోపాటు ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటుచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. శుక్రవారం సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ ర్యాలీని పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులు గ్రామీణ స్థాయి వారేనని, క్రీడల్లో (Sports) రాణించినవారికి ప్రభుత్వ ఉద్యోగుల్లో అవకాశం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.


