కలం వెబ్ డెస్క్ : నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిక్కడపల్లి(Chikkadpalli) పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్(RTC Crossroads) గురువారం నిరుద్యోగుల నిరసనలతో హోరెత్తింది. మరుసటి రోజే సీఎం చిక్కడపల్లిలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సీఎం పర్యటనకు నిరుద్యోగులు ఆటంకం కలిగించే అనుమానంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్లు, ఉద్యోగార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఏ క్షణాన ఏమవుతుందోనని పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు.


