కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసు(Drugs Case)లో చిక్కుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్((Rakul Preet Singh)) తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్(Aman Preet Singh)కు తెలంగాణ హైకోర్ట్(Telangana High Court) షాక్ ఇచ్చింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అమన్ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు. శుక్రవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్ట్ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. అమన్ నగరంలో పలువురు డ్రగ్ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నెల వ్యవధిలోనే అమన్ ఏడు సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నిందితుల ఫోన్‌ల ద్వారా గుర్తించారు. ఈ కేసులో అమన్ ఏ7గా ఉన్నారు. గతంలో సైతం అమన్ నార్సింగ్‌లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. మళ్లీ రెండోసారి పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. అయితే అమన్ మాత్రం తనను కేసులో అనవసరంగా ఇరికించారని, తనకు ఎలాంటి డ్రగ్ పెడ్లర్లతో సంబంధం లేదని పేర్కొంటున్నాడు. అమన్ కోసం ఈగల్ టీం, పోలీసులు గాలిస్తున్నారు.


