కలం వెబ్ డెస్క్ : దళపతి విజయ్(Vijay) సినిమాకు మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో ఊరట లభించింది. విజయ్ నటించిన జననాయగన్(Jananayagan) సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ (censor certificate) ఇవ్వాలని కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జనవరి 14న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జన నాయగన్ జనవరి 9న విదడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు పేర్కొంది. దీంతో మూవీ టీం విడుదల తేదీని వాయిదా వేసుకొని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ తీర్పుతో జననాయగన్ విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతానని, జననాయగన్ తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు కావాలనే విజయ్ సినిమాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
జననాయగన్‌కు మరో చిక్కు
జననాయగన్ (Jananayagan) సినిమాకు మరో చిక్కు వచ్చి పడింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారి చేసింది. దీంతో విడుదలకు ఉన్న చిక్కులు మొత్తం తొలగిపోయాయని భావించిన సమయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు ఈ పిటిషన్ పై విచారణ జరగబోతున్నది. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొన్నది.


