కలం వెబ్ డెస్క్ : డ్రగ్స్(Drugs) సరఫరాదారులు రెచ్చిపోతున్నారు. తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా, వినియోగం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా డ్రగ్స్ భారీగా తరలివస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Shamshabad Airport)లో గంజాయి(Marijuana) సరఫరా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఖతార్(Qatar) నుంచి హైదరాబాద్(Hyderabad)కు భారీ ఎత్తున గంజాయి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి 14 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.14 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సదరు వ్యక్తులు ఎవరికి గంజాయి సరఫరా చేస్తున్నారు, గతంలో ఎన్నిసార్లు అక్రమ రవాణా చేశారు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే వివరాలు తెలుసుకుంటున్నారు.


