కలం వెబ్ డెస్క్ : నల్గొండ(Nalgonda) జిల్లాలోని మిర్యాలగూడ(Miryalguda) బైపాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. టైల్స్ లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం అతి వేగంతో ఎదురుగా వస్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్(Cement Tanker)ను ఢీకొట్టింది. ఆ సమయంలో డీసీఎంలో టైల్స్‌తో పాటు కూలీలు కూడా ఉన్నారు. డీసీఎం ట్యాంకర్‌ను ఢీకొట్టిన కుదుపుతో డీసీఎంలో ఉన్న టైల్స్ పక్కనే ఉన్న కూలీలపై పడ్డాయి. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.


