epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హెలికాప్టర్​లో మేడారం జాత‌ర‌కు కేసీఆర్ !

కలం, మెదక్ బ్యూరో: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ వెళ్లనున్నారు (KCR to visit Medaram). ఈ మేరకు ఆయన అంగీకరించారని మంత్రులు కొండా సురేఖ, సీతక్క తెలిపారు. గురువారం సిద్ధిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్​ దంపతులను మంత్రులు కలిశారు. పట్టువస్త్రాలు పెట్టి, మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను వాళ్లకు అందించారు. అనంతరం మంత్రులు సురేఖ, సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలుగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్​ దగ్గరకు వచ్చామని, చీర పెట్టి కేసీఆర్​ దంపతులు సాదరంగా ఆహ్వానించారని తెలిపారు. మేడారం జాతరకు రమ్మని తాము ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. హెలికాప్టర్​​లో సతీసమేతంగా మేడారం జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని కేసీఆర్ అన్నారని వెల్లడించారు.​ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సుమారు రూ.200కోట్లతో మేడారంలో శాశ్వత గద్దెలు, ఇతర నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రులు పేర్కొన్నారు. ఈసారి మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని, జాతరకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

Read Also: పంట నిల్వకు రూట్ మ్యాప్ : మంత్రి ఉత్తమ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>