epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన హిమాచల్​ప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి

కలం, వెబ్​ డెస్క్​ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy )ని హిమాచల్​ ప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి రోహిత్​ ఠాకూర్​ (Rohit Thakur) సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను హిమాచల్ ప్రదేశ్ మంత్రికి సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. 25 ఎకరాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట మినీ యూనివర్సిటీ తరహాలో రూ.200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు రానున్నట్లు.. ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమించామని, త్వరలోనే పాలసీని తీసుకువస్తామని రేవంత్​ రెడ్డి వివరించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసేందుకు వీలుగా ప్రీ ప్రైమరీ విద్య అందించే విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ ప్రైమరీ చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే యోచన చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఐటఐలను ఏటీసీ లు గా తీర్చిదిద్దుతున్నట్లు.. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్​ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

మల్లెపల్లి ఐటీసీని సందర్శించాలని హిమాచల్ ప్రదేశ్ మంత్రి కి సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై ఆసక్తి చూపి హిమాచల్​ ప్రదేశ్​ మంత్రి.. స్కూల్స్​ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టతకు తీసుకుంటున్న చర్యలపై రేవంత్​ రెడ్డి (Revanth Reddy) ని మంత్రి రోహిత్ ఠాకూర్​ ని అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: బ్రోకర్లు, ఏజెంట్ల వ్యవస్థ బంద్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>