కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి (Amaravati) పై మాజీ సీఎం జగన్ (YS Jagan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ది చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నది పిచ్చి పని అంటూ మండిపడ్డారు.
రాజధాని అమరావతిని రివర్ బేసిన్ లో నిర్మిస్తున్నారని జగన్ అన్నారు. అమరావతి నిర్మాణంపై సుప్రీం కోర్టు కూడా దృష్టి సారించాలి. నదిలో భవనాలు కట్టేందుకు ఎవరైనా అనుమతి ఇస్తారా.. అమరావతిలో రాజధాని కట్టకూడదు. గుంటూరు- విజయవాడ మధ్య కడితే బాగుంటుంది. అసలు రాజధాని లేనిచోట చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదమే లేదు. సిఏం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుంది అని జగన్ (YS Jagan) తెలిపారు.
Read Also: రాయలసీమ ప్రాజెక్టుపై రగడ.. చంద్రబాబు అలా.. జగన్ ఇలా..!
Follow Us On: X(Twitter)


