కలం, వరంగల్ బ్యూరో : జనగామ (Janagaon) పట్టణంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న ఓ వైన్ షాప్ (wine shop) లోని సిట్టింగ్ గదిలో విస్తుపోయే దృశ్యం వెలుగుచూసింది. బుధవారం రాత్రి మద్యం తాగేందుకు వచ్చిన వారు మరుగుదొడ్డిలోకి వెళ్లగా, అక్కడ స్టౌ పెట్టి చికెన్, ఆమ్లెట్లు వండుతుండటం చూసి ఖంగుతిన్నారు. ఇలాంటి చోట ఆహారం తయారు చేస్తున్నారని ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.


