కలం, మెదక్ బ్యూరో : జీవో 229 (GO 229) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ (Sangareddy Medical College) కాలేజ్ ఎదుట జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఈ జీవో వల్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య రెట్టింపు అవుతుందని, దీంతో వైద్యుల ప్రాధాన్యత తగ్గి బ్యూరో క్రాట్ల ప్రాధాన్యత పెరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌ను నిర్వీర్యం చేసి, టీజీఎంసీ అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని జూనియర్ డాక్టర్లు విమర్శించారు.


