epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఐప్యాక్​పై ఈడీ దాడులు.. అమిత్​ షాపై దీదీ ఫైర్​

కలం, వెబ్​డెస్క్​: పొలిటికల్​ కన్సల్టెన్సీ ఐప్యాక్​పై గురువారం ఈడీ దాడు (ED raids on IPAC) లు చేసింది. మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా కోల్​కతాలోని ఆ సంస్థ కార్యాయంతోపాటు, డైరెక్టర్​ ప్రతీక్​ జైన్​ ఇంటిలో సోదాలు జరిపింది. ఈ విషయం తెలిసి పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కోల్​కతా పోలీస్​ కమిషనర్ మనోజ్ వర్మ​, టీఎంసీ నాయకులతో కలసి ప్రతీక్ జైన్​ ఇంటికి వెళ్లడం కలకలం రేపింది. అనంతరం ఈ విషయంపై ఐప్యాక్​పై ఈడీ రైడ్స్​ను రాజకీయ కక్ష్యగా మమతా బెనర్జీ ఆరోపించారు. ‘ఐప్యాక్​ టీఎంసీకి రాజకీయ కన్సల్టెన్సీ. మా పార్టీ రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారం తెలుసుకునేందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీకి సంబంధించిన హార్డ్​ డిస్క్​ను తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచలేని దుష్ట హోంమంత్రి అమిత్​ షా ఈ దుర్మార్గ పని వెనక ఉన్నారు. ఆయన మా పార్టీ అభ్యర్థుల డేటా లాక్కోవాలనుకుంటున్నారు. ఒక వైపు ‘సర్​’ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారు. మరోవైపు ఇలా అన్యాయంగా మా పార్టీ డేటా తీసుకోవాలనుకుంటున్నారు. మీలాగే నేనూ మీ పార్టీ డేటా తీసుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది?’ అని దీదీ మండిపడ్డారు.

కాగా, సోదాలను అడ్డుకోవడంపై ఈడీ స్పందించింది. ‘బొగ్గు స్కామ్​లో వచ్చిన డబ్బును గోవా ఎన్నికల్లో వాడేందుకు ఐప్యాక్​కు టీఎంసీ ఇచ్చినట్లు కేసు ఫైల్​ అయ్యింది. ఇందులో ఆధారాల సేకరణకు ప్రయత్నిస్తుంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు అడ్డుపడడం తగదు’ అని ఈడీ పరోక్షంగా మమతను ఉద్ధేశించి వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మేల్య సువేందు అధికారి ఈ ఘటనపై స్పందించారు. ‘రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఈడీ దాడు (ED raids on IPAC ) లను అడ్డుకోవడం, సోదాలకు అంతరాయం కలిగించడం సరికాదు. మమతపై ఈడీ చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. కాగా, పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్​ను 2014 లోక్​సభ ఎన్నికలకు ముందు ప్రశాంత్​ కిశోర్​, ప్రతీక్ జైన్​ స్థాపించారు. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడుగా ప్రతీక్​ జైన్​ పనిచేస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో 2019 నుంచి ఐప్యాక్​ సంస్థ టీఎంసీకి ఎన్నికల కన్సల్టెన్సీగా పనిచేస్తోంది. టీఎంసీ ఐటీ వింగ్​ హెడ్​గా ప్రతీక్ జైన్​ పనిచేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>