కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి (Rangareddy) జిల్లా మోకిలా ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీర్జాగూడ సమీపంలో అతివేగంతో వెళ్తున్న ఒక స్పోర్ట్స్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐసిఎఫ్ఏఐ (ICFAI) యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఐదుగురు విద్యార్థులు ఉండగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాద (Road Accident) దాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నారు.

Read Also: ప్రభాస్ రాజాసాబ్ క్రేజ్.. థియేటర్‌కు మొసలి పిల్లలు!
Follow Us On: X(Twitter)


