కలం, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ది రాజా సాబ్ (Raja Saab) మూవీపై భారీ అంచనాలున్నాయి. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఇప్పటికీ పలు చోట్ల రాజాసాబ్ ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర-నాసిక్‌లోని ఓ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేశారు. మొసలి పిల్లలతో థియేటర్‌కు వచ్చారు. మొసలి పిల్లలను ప్రదర్శిస్తూ తమ అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కాదు.. డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రభాస్ రాజాసాబ్ క్రేజ్.. థియేటర్‌కు మొసలి పిల్లలు!
The Raja Saab Release: Viral Video Show Die-Hard Prabhas Fans Celebrating with Crocodiles at Nashik Cinema Theaterhttps://t.co/WE6XVB2Nii#TheRajaSaab #Prabhas #CrocodileAtTheater #PrabhasFanBase #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/ZuIWkVDHBH— Kalam Daily (@kalamtelugu) January 8, 2026
Read Also: మరోసారి వార్తల్లో ట్రంప్ : ప్రపంచ దేశాధినేతలపై సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Youtube


