29న వ‌న‌ప‌ర్తిలో రజక సంఘం జిల్లా సమావేశం

కలం, వనపర్తి: ఈ నెల 29న నిర్వహించనున్న వనపర్తి (Wanaparthy) జిల్లా రజక సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘం ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల రజక సంఘం నాయకులు, సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

జిల్లా కమిటీలో అన్ని మండలాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని, సంఘం అభివృద్ధికి కృషి చేయాలనే ఆసక్తి ఉన్న నాయకులు, యువకులు ముందుకు వచ్చి కమిటీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు టి. ఆంజనేయులు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రచనూరు వెంకట్రాములు, మాజీ కన్వీనర్ చిట్యాల కొండయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి సిట్టిరాజుల సాలేష్, మాజీ అధ్యక్షుడు దేవరకొండ విజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కరాటే శేఖర్, వజ్రాల రమేష్, దాసరాజుల రాము తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>