హై టెన్షన్.. బెంగళూరులో షర్మిలను అడ్డుకున్న పోలీసులు!

కలం, వెబ్ డెస్క్ : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఇంట పెళ్లి సందడి నెలకొన్న వేళ బెంగళూరులో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. నవంబర్ 25న తన కుమార్తె అంజలి వివాహం జరగనున్న నేపథ్యంలో, కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు చేరుకున్న షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. తల్లి విజయమ్మ, పిల్లలతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, వివాదాస్పదంగా మారిన వైసీపీ అధినేత జగన్ యలహంక నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లోని డిపార్చర్ గేట్ 5 వద్ద భద్రతా సిబ్బంది నడుమ బయటకు వచ్చిన ఆమె కాన్వాయ్‌ను ఎయిర్‌ఫోర్స్ క్రాస్ వద్ద పోలీసులు నిలిపివేసి, ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

యలహంకలోని కట్టిగెనహళ్లి ప్రాంతంలో ఉన్న ఈ ఆస్తిపై నెలకొన్న వివాదం నేపథ్యంలో, బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లీజు హక్కులు కలిగి ఉన్న సిలికాన్ బిల్డర్స్ సంస్థ పిటిషన్ మేరకు, షర్మిల గానీ ఆమె కుటుంబ సభ్యులు గానీ ఆ ప్రాంగణంలోకి ప్రవేశించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను కారణంగా చూపుతూ పోలీసులు ఆమెను నిలువరించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన షర్మిల, “ఇంట్లో పెళ్లి పెట్టుకుని నా సొంత ఇంటికి నేను వెళ్లడం కూడా తప్పేనా?” అంటూ పోలీసులను నిలదీశారు. దాదాపు 20 నిమిషాల పాటు పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అయితే, కోర్టు ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు.దీంతో తల్లి విజయమ్మ, పిల్లలతో కలిసి షర్మిల బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోది. ఓవైపు ఇంట పెళ్లి వేడుకలు, మరోవైపు ఆస్తుల వివాదం నేపథ్యంలో యలహంక ప్యాలెస్ వద్ద జరిగిన ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>