కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని ప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద రాతి స్తంభంపై కార్తీక దీపం (Thiruparankundram Deepam) వెలిగించే అంశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీన ఒక్కసారి మినహాయింపుగా అక్కడ దీపం వెలిగించుకునేందుకు అనుమతిస్తూ నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ (HR&CE) కమిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులపై పునఃపరిశీలన జరపాలని కోరుతూ కమిషనర్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

