కలం, భైంసా: భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో ఉన్న అరెల్లి మైసమ్మ, రాజుల వారి దేవాలయంలో ఆదివారం విగ్రహ పునఃప్రతిష్ఠాపన నిర్వహించారు. కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Ramarao Patel) పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటలు సమృద్ధిగా పండాలని.. ప్రతి ఏటా అరెల్లి మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే (MLA Ramarao Patel) తెలిపారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని అందించిన దాత సురేష్ చింతవార్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము తదితరులు పాల్గొన్నారు.

