మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్‌పై కఠిన చర్యలు : ఎస్సై మహేష్

కలం, మామడ : మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో మామడ పోలీసులు (Mamada Police) ప్రత్యేక దృష్టి సారించారు. మైనర్ల వాహన డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పిల్లల సరదా కోసం వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని తల్లిదండ్రులకు సూచించారు. 18 ఏళ్లలోపు వారికి మోటారు వాహనాలు నడిపేందుకు అనుమతి లేదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించి మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జరిమానాలతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>