కలం, వనపర్తి: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ వర్గాల అభ్యున్నతి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ కమిటీ (Congress SC Department Committee) ని ఏర్పాటు చేసినట్లు ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు ఈరపోగు రాజ్‌కుమార్ తెలిపారు. ఆదివారం 34 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఎస్సీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఐక్యత, క్రమశిక్షణతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు గంధం రాజశేఖర్, కౌన్సిలర్ గంధం శరబంధ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, పెద్దమందడి మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు గొర్ల అనిల్, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

