కలం, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో (Siricilla) జనశక్తి నక్సల్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9ఎంఎం పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్ బిగితే తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం.. జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, పయ్యాలపు గోవర్ధన్ తో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన మంజరి సురేందర్ ముఠాగా ఏర్పాడి జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు వసూళ్లు, భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. పక్కా సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు.
Read Also: సిరిసిల్లలో గులాబీకి గుబులు
Follow Us On : WhatsApp


