కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు (IPS Transfers) జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు కమిషనరేట్ల పరిధిలో 20 మంది పోలీసు అధికారులను బదిలీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీ సౌత్ రేంజ్ ఏసీపీ గా తఫ్సీర్ ఇక్బాల్, నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఎన్.శ్వేత.. హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సీపీగా విజయ్ కుమార్ నియమితులయ్యారు.
కుత్బుల్లాపూర్ డీసీపీగా కోటిరెడ్డి
మహేశ్వరం డీసీపీగా కే.నారాయణ రెడ్డి
సికింద్రాబాద్ జోన్ డీసీపీగా రక్షితా కే మూర్తి
ఉప్పల్ జోన్ డీసీపీగా సురేశ్ కుమార్
చార్మీనార్ డీసీపీగా కిరణ్ ప్రభాకర్
ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ
చేవెళ్ల జోన్ డీసీపీగా యోగేష్ గౌతమ్
కూకట్ పల్లి జోన్ డీసీపీగా రీతి రాజ్
శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చంతమనేని శ్రీనివాస్
సిద్దిపేట సీపీగా రష్మీ పెరమాళ్
మల్కాజిగిరి జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీధర్
రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్
ఖైరతాబాద్ డీసీపీగా శిల్పవల్లి
గోల్కొండ డీసీపీగా చంద్రమోహన్
జూబ్లీహిల్స్ జోన్ డీసీపీగా రమణారెడ్డి
శంషాబాద్ డీసీపీగా రాజేశ్
షాద్ నగర్ డీసీపీగా శిరీష నియామకమయ్యారు.
Read Also: రాష్ట్రంలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి : మంత్రి పొంగులేటి
Follow Us On: Sharechat


