కలం, వెబ్ డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ. ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మేడారం ఏర్పాట్లు, జాతర నిర్వహణపై మంత్రి సీతక్క (Seethakka) బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18, 19 తేదీల్లో మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు. నూతనంగా నిర్మించిన గద్దెలు, ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు సీతక్క వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో గద్దెల పునరుద్ధరణ జరిగిందని, ఆదివాసీలకే కాదు కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ అని సీతక్క అన్నారు. అందరి సహకారంతో అమ్మవార్ల జాతరను విజయవంతం చేస్తామన్నారు. మేడారం జాతర కోసం ప్రభుత్వం దాదాపు 100 కోట్లను మంజూరుచేసిందని మంత్రి సీతక్క గుర్తుచేశారు.

Read Also: అసెంబ్లీకి బీఆర్ఎస్ పర్మినెంట్ గుడ్‌బై?
Follow Us On : WhatsApp


