కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ది రాజాసాబ్ (RajaSab Movie) ఈ నెల 9న రిలీజ్ కానుంది. అయితే.. రాజాసాబ్ కు థియేటర్స్ దొరకడం లేదు.. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అదేంటి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకి థియేటర్స్ దొరకకపోవడమా..? ఇదేదో గాసిప్.. ఎవరో తెలియక రాసింది అనుకుంటే.. పొరపాటే. నిజంగానే రాజాసాబ్ కు థియేటర్స్ దొరకడం లేదు. కాకపోతే తెలుగులో కాదు.. తమిళ్ లో. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. తమిళ సినిమాలకు మన వాళ్లు కావాల్సిన అన్ని థియేటర్స్ ఇస్తారు. అదే మన సినిమాకి మాత్రం తమిళనాడులో థియేటర్స్ ఇవ్వరు. ఆమధ్య కిరణ్ అబ్బవరం క సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదని.. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకే థియేటర్లు ఇవ్వని పరిస్థితి వచ్చింది. అయితే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా టైమ్ లో దిల్ రాజు… తమిళ సినిమాను తెలుగులో రిలీజ్ కాకుండా ఆపించానని.. చెప్పారు. అప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆయన సినిమా ఉంది కాబట్టి ఆపించారు.. ఇప్పుడు ఆయన సినిమా లేదు కాబట్టి.. మాట్లాడడం లేదా..? ఇప్పుడు ఎందుకు మాట్లాడరు దిల్ రాజు గారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నిజమే ఇప్పుడు ఆయన సినిమా లేదు. అలాగే RajaSab Movie రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు. అందుకనే ఆయన పట్టించుకోవడం లేదా అనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా.. మన సినిమాలకు థియేటర్లు ఇవ్వనప్పుడు.. మనమేందుకు తమిళ సినిమాలను నెత్తిన పెట్టుకోవాలి అనే మాట వినిపిస్తుంది. చూడాలి మరి.. ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో..?
Read Also: లక్ అంటే ది రాజాసాబ్ దే.. కానీ..!
Follow Us On: Sharechat


