కలం వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఖమ్మం (Khammam) పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచికి చేరుకున్న కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్సీపీ జెండాలతో కేటీఆర్‌కు స్వాగతం పలకడం విశేషం. పలువురు వైయస్ జగన్ (YS Jagan) అభిమానులు జై కేసీఆర్(KCR), జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కొందరు కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సైతం ఖమ్మం జిల్లాలో పలువురు వైసీపీ, బీఆర్ఎస్ జెండాలతో ప్రచారం నిర్వహించారు. వైయస్ జగన్ పుట్టిన రోజున తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
Read Also: సరికొత్త రికార్డ్.. 24 గంటల్లో 28.95 కి.మీ రోడ్డు నిర్మాణం, పవన్ హర్షం
Follow Us On : WhatsApp


