కలం, వెబ్ డెస్క్: స్టార్స్ హీరోయిన్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపుతున్నారు. అందం, అదిరిపొయే హుక్ స్టెప్స్‌తో హీరోలతో సమానంగా పోటీపడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) పలు భారీ బడ్జెట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తున్నారు. దీంతో తమన్నాకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇటీవల ఓ ఈవెంట్‌లో డ్యాన్స్ చేసినందుకుగాను 6 నిమిషాలకే 6 కోట్లు వసూలు చేసింది. అంటే నిమిషానికి దాదాపు కోటి రూపాయలు తీసుకుంది.
డిసెంబర్ 31న గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా పాల్గొంది. ఆకట్టుకునే నృత్య ప్రదర్శనతో వార్తల్లో నిలిచింది. ఇది తమన్నా భారీ డిమాండ్‌ను తెలియజేస్తోంది. తమన్నా ఇటీవలి విజయంలో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. జైలర్ మూవీ, “కావాయ్యా”, స్త్రీ– 2 లోని “ఆజ్ కీ రాత్”, రైడ్ 2 లోని “నాషా” లాంటి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను కొల్లగొట్టాయి. ఒకప్పుడు మెయిన్ హీరోయిన్గా నటించిన తమన్నా ఇటీవల ప్రత్యేక పాటల్లో మెరుస్తున్నారు.

Read Also: సమంత కొత్త సినిమాపై బిగ్ అప్డేట్..!
Follow Us On: X(Twitter)


