కలం వెబ్ డెస్క్ : ఇంగ్లీష్ భాషలో సామాన్యులను ఇబ్బంది పెట్టే పోలీస్ కేసుల అభియోగపత్రం, దర్యాప్తు, కోర్టు విచారణ పత్రాలను సులభతరం చేస్తూ దుండిగల్ (Dundigal) పోలీస్ స్టేషన్‌లో వినూత్న కార్యక్రమం రూపుదిద్దుకుంది. మాతృభాషపై మమకారంతో డాక్యూమెంట్లన్నీ ఇంగ్లీష్‌లోనే ఉండే విధానానికి స్వస్తి చెప్తూ తెలుగులో నివేదికలు (Telugu Charge Sheet) తయారు చేస్తున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా (Head Constable) పని చేస్తున్న స్వరూప (Swaroopa) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
స్వరూపకు మాతృభాష తెలుగు అంటే ఎంతో ఇష్టం. ఇంగ్లీష్ రాని సామాన్యులకు కూడా కేసు వివరాలు పూర్తిగా అర్థం కావాలనే ఉద్దేశంతో 2025లో రెండు కేసుల దర్యాప్తు నివేదికలను (Telugu Charge Sheet) పూర్తిగా తెలుగులోనే కోర్టుకు సమర్పించారు. స్వరూప తన విధి నిర్వహణలో సైతం మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక మిస్సింగ్ కేసును వేగంగా ఛేదించి, తల్లీ బిడ్డలను క్షేమంగా కుటుంబసభ్యులకు అప్పగించి తన కర్తవ్యాన్ని చాటుకున్నారు. స్వరూప తెలుగులో ఛార్జ్‌షీట్ రూపొందించి మేడ్చల్ కోర్టులో సమర్పించేందుకు ఏసీపీ శంకర్ రెడ్డి సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. విధి నిర్వహణలో స్వరూపకు ఉన్న నిబద్ధతను గుర్తించి ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార భాషలో దర్యాప్తు పూర్తి చేసినందుకు గాను ఇటీవల బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ ప్రశంసా పత్రం అందించి అభినందించారు.
Read Also: ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణ.. ఇక ట్రాఫిక్ జామ్‌కు బైబై..!
Follow Us On: X(Twitter)


