ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు(High Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువు ముగిసినా ఇప్పటికీ మత్స్య సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని న్యాయస్థానం నిలదీసింది. మిగిలిన 21 జిల్లాల్లో త్వరితగతిన మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే ఆదేశించింది హైకోర్టు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ముదిరాజు సంఘం నాయకులు.. కోర్టు దిక్కరణ కింద మరోసారి పిటిషన్ వేశారు. ఆ పటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. కోర్టు దిక్కరణ కింద ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా మత్స్యకార సంఘాల ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.
Read Also: రేవంత్‌కు ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు: HYC సల్మాన్

