కలం వెబ్ డెస్క్ : వెనెజువెలాలో (Venezuela) జరుగుతున్న తాజా పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా ప్రజల భద్రత, సంక్షేమమే అందరికీ మొదటి ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. బుధవారం లక్సెంబర్గ్ (Luxembourg) ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి జావియర్ బెట్టెల్‌తో (Xavier Bettel) సమావేశం అనంతరం జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలాతో భారత్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గాలు కలిసి ప్రజల ప్రయోజనాలు, భద్రత దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
వెనెజువెలాలో (Venezuela) నెలకొన్న పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతోందన్నారు. అక్కడి ప్రజల శ్రేయస్సు, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని పక్షాలను కోరారు. ఇతర దేశాల వైఖరిపై కూడా ఆయన పరోక్షంగా స్పందించారు. “ఈ రోజుల్లో చాలా దేశాలు తమకు లాభం ఉన్నప్పుడే చర్యలు తీసుకుంటాయి. కానీ ఉచిత సలహాలు మాత్రం ఇస్తుంటాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా కొందరు దేశాలు ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశాయి. వాళ్లు ముందుగా తమ ప్రాంతాల్లోని పరిస్థితులను చూసుకుంటే మంచిది,” అంటూ వ్యాఖ్యానించారు. వెనెజువెలాలో శాంతి నెలకొని, ప్రజల జీవితం సాధారణ స్థితికి రావాలన్నదే భారతదేశ ప్రధాన ఆకాంక్ష అని జైశంకర్ స్పష్టం చేశారు.
Read Also: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. పట్టాలెక్కేందుకు సిద్ధం!
Follow Us On: Instagram


