కలం, వెబ్ డెస్క్: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళకు దిగారు. భారత్ సమ్మిట్ వద్ద ఉన్న నోవాటెల్ హోటల్లో రాహుల్ బస చేయగా.. బయట పెద్ద ఎత్తున కమలం శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఒక ఫ్లెక్సీని కూడా చించేయడంతో ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు.. పలువురు నాయకులను హోటల్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుని.. వారిని వ్యాన్లలో ఎక్కించి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ముందు మాట ఇచ్చి తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తమదేనన్న రాహుల్ గాంధీ.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

