కలం, వెబ్ డెస్క్: ఏపీలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త ముందుకు రావాలని ఆకాంక్షించారు. దేశంలో తలసరి ఆదాయంలో ఏపీ 13వ స్థానంలో ఉందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. పారిశ్రామిక రంగంలో మహిళలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైగా పదవులు ఇచ్చామని తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు విశాఖపట్నంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీ స్టార్టప్ ఎక్స్ఛేంజ్ (APEX) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
1.48 లక్షల మందికి ఉద్యోగాలు..
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేసుకున్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. ఇక సౌర విద్యుత్ ఏర్పాటులో దేశంలో ఏపీ ముందున్నదని తెలిపారు. సీఐఐ సదస్సు(CII Summit)కు 450 మంది పెట్టుబడుల ప్రతినిధులు వచ్చారని తెలిపారు. పారిశ్రామిక వేత్తలతో 194 ఎంఓయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. రూ.82 వేల 522 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. దీంతో 1.48 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడుల ఒప్పందాల్లో 70 శాతం పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతున్నాయని చెప్పారు. రెండున్నరేళ్లలో రూ.32 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
Also Read : న్యూ లుక్‌లో కీర్తి సురేశ్..‘సత్యవాన్ సావిత్రి’ ట్రైలర్ రిలీజ్
Follow Us On : WhatsApp

