రైడ్ కు ముందస్తు ‘టిప్’.. ఓలాకు భారీ జరిమానా!

కలం, వెబ్ డెస్క్ : క్యాబ్ బుకింగ్ త్వరగా ఖరారు కావాలంటే అదనపు డబ్బులు చెల్లించాలంటూ ప్రయాణికులను తప్పుదోవ పట్టించిన ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ‘ఓలా’పై (Ola Fine) కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) కొరడా ఝులిపించింది. డ్రైవర్ రైడ్‌ను అంగీకరించకముందే ‘టిప్’ లేదా ‘యాడ్-ఆన్’ పేరుతో రూ.10 నుంచి గరిష్టంగా రూ.499 వరకు అదనపు మొత్తాన్ని ప్రోత్సహించే ఫీచర్‌ను తీసుకొచ్చినందుకు ఆ సంస్థపై మండిపడింది. ఈ ప్రక్రియ వినియోగదారులను తప్పుదోవ పట్టించి, బలవంతంగా అదనపు డబ్బులు చెల్లించేలా చేసే ‘డార్క్ ప్యాటర్న్’ (మోసపూరిత టెక్నిక్స్) కిందకు వస్తుందని చెప్పి ఓలాకు రూ.10 లక్షల జరిమానా విధించింది.

అయితే అదనంగా డబ్బులు చెల్లించినా క్యాబ్ త్వరగా దొరికే అవకాశాలు పెరగలేదని CCPA విచారణలో తేలింది. బెంగళూరులో యాడ్-ఆన్ చెల్లించిన రైడ్లలో కేవలం 40 శాతం మాత్రమే అంగీకారం పొందగా, అదనపు చెల్లింపు లేని రైడ్లకు 68 శాతం అంగీకారం లభించిందని తెలిపింది. ఢిల్లీ, ముంబైలోనూ ఇదే ధోరణి కనిపించిందని పేర్కొంది. ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రయాణికులను ఈ తరహా పాప్-అప్ సందేశాలు భయాందోళనకు గురిచేసి అదనపు చెల్లింపుల వైపు నెడుతున్నాయని అథారిటీ ఫైర్ అయింది.

మోటార్ వెహికల్ అగ్రిగేటర్స్ మార్గదర్శకాలు-2025 ప్రకారం ‘టిప్’ అనేది ప్రయాణం పూర్తయ్యాక పూర్తిగా ప్రయాణికుల ఇష్టప్రకారం ఇవ్వాల్సిన స్వచ్ఛంద చెల్లింపు అని CCPA స్పష్టం చేసింది. యాప్‌లో ముందస్తు టిప్/యాడ్-ఆన్ ఫీచర్లను తక్షణమే నిలిపివేసి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఓలాను ఆదేశించింది. ఇదే తరహా నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటికే ర్యాపిడో కు కూడా రూ.10 లక్షల జరిమానా విధించగా, ఉబర్, నమ్మ యాత్రి సంస్థలపై విచారణ కొనసాగుతోంది.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో సంచలనాలు: సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>