బ్యాంకింగ్‌ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌ రాజర్షి షా

కలం, బేల: గ్రామీణ ప్రజలు, రైతుల ఆర్థికాభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, సాంగిడి పరిసర గ్రామాల ప్రజలు నూతనంగా ప్రారంభించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank) సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. శుక్రవారం బేల మండలం సాంగిడి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన శాఖను కలెక్టర్‌ ప్రారంభించారు.

ఈ కలెక్టర్ సందర్భంగా మాట్లాడుతూ.. బ్యాంకింగ్‌ సేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ కావడం వల్ల రైతులు, మహిళా సంఘాలు, కూలీలు, చిరువ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు తెరిచి పొదుపు అలవాటు చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం, రాయితీ రుణాలు పొందేందుకు బ్యాంకు ఖాతాలు అవసరమని తెలిపారు. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు కురవక పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులను ఆదుకునేందుకే బేల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నారని, నష్టపోయిన ప్రతి ఎకరా వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారని తెలిపారు.

కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు బ్యాంకుల ద్వారా పొందిన పంట రుణాలను రీషెడ్యూల్‌ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు (Telangana Grameena Bank) ప్రాంతీయ మేనేజర్‌ అప్పారావు, శాఖ మేనేజర్‌ రోహిత్‌ శర్మ, సర్పంచులు భూపతిరెడ్డి, అశోక్‌ ఠాక్రే, నాయకులు రఘుకుల్‌ రెడ్డి, రూపేష్‌ రెడ్డి, బాలచందర్‌, నాయబ్‌ తహసీల్దార్‌ వామన్‌, బ్యాంకు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Also Read : ఇసయ్యా అరుమై నాయగంకు అర్జున అవార్డ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>