ఇసయ్యా అరుమై నాయగంకు అర్జున అవార్డ్!

క‌లం, వెబ్‌డెస్క్‌: భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఇసయ్యా అరుమై నాయగం (Isaiah Arumainayagam)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డు ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన జాతీయ క్రీడా, సాహస పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డు అందించారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో ఇస‌య్యా సభ్యుడిగా ఉన్నారు. అలాగే 1964లో టెల్ అవీవ్‌లో జరిగిన ఏఎఫ్‌సీ ఆసియా కప్‌లో రజత పతకం సాధించిన భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. దశాబ్దాల క్రితం భారత ఫుట్‌బాల్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం లభించింది.

Also Read : మార్కో జాన్సెన్‌కు ఐసీసీ అరుదైన గుర్తింపు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>