దేశ రహస్యాలు లీక్.. ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ గూఢచర్యంలో చిక్కుకుని, దేశ రహస్యాలు లీక్ చేసిన ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌(IAF Wing Commander)ను ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థాన్ మహిళా ఏజెంట్ వేసిన ట్రాప్‌లో పడిన వింగ్ కమాండర్‌ అనైతిక చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు. ‘ఒక్క న్యూడ్ పిక్ పంపిస్తే..దేశ యుద్ధ ప్రణాళికలకు సంబంధించిన ఒక్కో రహస్యాన్ని నీకు చెబుతా’ అంటూ మెసేజ్‌లు చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. వాట్సాప్ చాట్‌ ద్వారా అనేక విషయాలను ఆమెకు చేరవేసినట్లు గుర్తించారు.

ఎక్కువగా డ్రోన్ల సమాచారం..

యుద్ధ ప్రణాళికలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రోన్ల యూనిట్లకు సంబంధించి అత్యంత రహస్య సమాచారాన్ని వింగ్ కమాండర్ పాకిస్థాన్ ఏజెంట్‌కు పంపించినట్లు నిర్ధారించారు. డ్రోన్ల ట్రయల్స్, వాటి పనితీరు, ఎక్కడెక్కడ వాటిని మోహరిస్తున్నారో తెలిపే మ్యాప్స్, యుద్ధ విమానాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, మిలిటరీ ఆపరేషన్స్ తదితర వివరాలను చెప్పేసినట్లు అందులో తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్ భారత ఆర్మీ అధికారులే లక్ష్యంగా అందమైన యువతుల ద్వారా ట్రాప్స్ వేస్తోంది. ఇటీవల విశాఖపట్నంలోని నేవల్ కమాండ్‌లో పనిచేస్తున్న ఒక అధికారి కూడా ఇలాగే దొరికిపోయిన విషయం తెలిసిందే.

Also Read : ఉగ్రవాదుల కోసం డ్రోన్లతో వేట.. భారీ పారితోషికం ప్రకటన!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>