కలం, నిర్మల్: బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా (General Secretary) జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన మగ్గిడి దేవిదాస్ (Devidas ) నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. బీసీల హక్కుల సాధన, సంక్షేమం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ పనిచేయాలని ఆకాంక్షించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ బీసీల ఐక్యతకు, అభ్యున్నతికి కృషి చేస్తానని దేవిదాస్ తెలిపారు.

