కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కనక్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం(Pakistan Military Camp)పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వాహన ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడులో 11 మంది పాకిస్థాన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు అనంతరం ఖందావా పోస్టుపై దాడి చేసి లోపలికి చొరబడేందుకు మిలిటెంట్లు ప్రయత్నించగా సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు బీఎల్ఏ మిలిటెండ్లు హతమయ్యారు. పేలుడు ధాటికి సమీపంలోని నివాస గృహాలు దెబ్బతినడంతో పాటు ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనాస్థలాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
Also Read : మోదీపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

