స్వచ్ఛత కార్యక్రమంతో నిరసన తెలిపిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

కలం, నిర్మల్: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల (NHM Employees) న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 32వ రోజుకు చేరుకుంది. నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం వద్ద డ్రై డే ఫ్రైడే కార్యక్రమం (Dry Day Friday Programme) నిర్వహించారు. కార్యాలయ పరిసరాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు విశేష సేవలందించిన తమ పట్ల ప్రభుత్వం కనీస కనికరం చూపకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు ఆహ్వానించాలని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>