కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలో ఉన్న చిన్న చెరువు కట్ట నిర్మాణ పనులను (Lake Bund Works) స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Laxma Reddy) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు కట్ట వద్ద జరుగుతున్న పనుల తీరుతెన్నులను, ఇప్పటివరకు జరిగిన పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరంగా, ఉపయోగకరంగా ఉండేలా చెరువు కట్టను తీర్చిదిద్దాలని, చెరువు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

