కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర కాంగ్రెస్ సంస్థాగత మార్పుల్లో భాగంగా ఎస్సీ డిపార్ట్ మెంట్ చైర్‌పర్సన్ (Congress SC Cell)గా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampalli Satyanarayana)ను ఏఐసీసీ నియమించింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాంధీభవన్‌కు పంపిన కమ్యూనికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతల్లో ప్రీతమ్ కొనసాగారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశం మేరకు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియమితులయ్యారు.
ప్రస్తుతం మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వృత్తిరీత్యా వైద్యులు. ఉస్మానియా వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌గా దీర్ఘకాలం పనిచేశారు. రాష్ట్రంలోని ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేలలో డాక్టర్ కవ్వంపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ తరఫున నిశితంగా అధ్యయనం చేసి ఏఐసీసీ స్థాయిలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లును రూపొందించడంలో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇప్పుడు Congress SC Cell చైర్‌పర్సన్‌గా నియమితులు కావడం గమనార్హం.
Read Also: రుణమాఫీపై కోర్టుకెక్కిన రైతు.. పిటిషన్ దాఖలు
Follow Us On : WhatsApp


