కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు గర్జన’ (Rythu Garjana) కార్యక్రమంలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కార్యక్రమానికి హాజరైన వీఐపీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. వీఐపీ పాసులు ఉన్నప్పటికీ లోపలికి అనుమతించకపోవడంతో గేట్ల వద్ద తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వీఐపీ పాసులు చూపించినా భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది.
పలువురు కార్యకర్తలను భద్రతా సిబ్బంది చొక్కాలు పట్టుకుని వెనక్కి నెట్టడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. చివరకు అక్కడికి చేరుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav)ను వేదికపైకి తీసుకెళ్లారు. పాసులు జారీ చేసినప్పటికీ అనుమతులు ఎందుకు నిరాకరించారంటూ కార్యకర్తలు భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలకే ఈ పరిస్థితి ఎదురుకావడంపై అసహనం వ్యక్తం చేశారు.
Also Read : తెలంగాణలో 10+2 విద్యా విధానం.. సీఎం కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

