ఉగ్ర దాడి వారి పనే.. జమ్మూలో హై అలర్ట్!

కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి (Kulgam Terrorist Attack) వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర ముఠాల హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు సీఆర్పీఎఫ్ ప్రకటించింది. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో మీర్ బజార్ దగ్గర ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయం వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలిపింది. గాయపడిన జవాన్లు సోమ్‌వీర్ సింగ్, సంతానో, రాకేష్ దాస్‌ను వెంటనే అనంత్‌నాగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన తోటి జవాన్లు.. ముష్కరులు కాల్పులు జరపడంతో తప్పించుకుని పారిపోయారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.

జల్లెడ పడుతున్న జవాన్లు..

ముగ్గురు జవాన్లపై కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కుల్గాం జిల్లాలోని అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఘటనా స్థలానికి చేరుకుని.. సమీక్ష నిర్వహించారు. అనంత్ నాగ్ జిల్లా కలెక్టర్ గాయపడిన ముగ్గురు జవాన్ల పరిస్థితిపై ఆరా తీశారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత నేరుగా భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాల్పడిన మొదటి ఘటన ఇదే.

Also Read :1968లో రాజీవ్‌తో పెళ్లి.. పౌరసత్వంపై 15 ఏళ్ల నిరీక్షణ ఎందుకు? : కంగనా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>