రూపునారాయణపేట మానేరు వాగుపై హై లెవల్ బ్రిడ్జి పనులు పునఃప్రారంభం

కలం, పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం రూపునారాయణపేట మానేరు వాగు (Manair River) పై జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామం వరకు రూ. 80 కోట్ల నిధులతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి (Bridge) పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓదెల మండలం రూపునారాయణపేట మానేరు వాగుపై జమ్మికుంట మండలం విలాసాగర్ వరకు అవసరమైన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 80 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. వాటి పనులను గత కొన్ని నెలల క్రితమే ప్రారంభించారని,  కానీ సంబంధిత కాంట్రాక్టర్ల లోపంతో పనులు పూర్తి కాలేదని, ఆ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఇతర కాంట్రాక్టర్‌కు అప్పగించి తిరిగి ఈరోజు పనులను పునఃప్రారంభించామని తెలిపారు.

ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల నుంచి జమ్మికుంట, హుజురాబాద్, వరంగల్ వెళ్లే ప్రజలకు వీలుగా వారి దూర భారాన్ని తగ్గించే విధంగా రూపునారాయణపేట మానేరు వాగుపై హై లెవల్ వంతెన నిర్మించడం జరుగుతుందని, దాని వల్ల తరచూ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి జమ్మికుంట, జమ్మికుంట, హుజురాబాద్ నుంచి పెద్దపల్లికి వచ్చే ప్రజలకు ప్రయాణ దూరం, సమయం తగ్గుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట మంత్రివర్గం సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గానికి అనేక నిధులు మంజూరు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. రూపునారాయణపేట మానేరు వాగుపై హై లెవల్ వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించి నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశించారు.

కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, సింగిల్ విండో ఛైర్మన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,యూత్ నాయకులు, గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>