కాంగ్రెస్ ప్రభుత్వంపై వినయ్ భాస్కర్ ఫైర్.. మూడు ప్రశ్నలు, మూడు డిమాండ్లు!

కలం, హనుమకొండ: వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ (Dasyam Vinay Bhasker) ను గృహ నిర్బంధం చేశారు.

ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన నాయిని రాజేందర్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కాజీపేట బ్రిడ్జి నిర్మాణానికి గతంలో రూ.76 కోట్లు తీసుకొచ్చి 80 శాతం పనులు పూర్తి చేశామని, వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న బ్రిడ్జి, బస్టాండ్ నిర్మాణాలు ఏమయ్యాయని మూడు ప్రశ్నలు సంధించారు.

అలాగే వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వారి తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని మూడు డిమాండ్లు చేశారు. అర్ధరాత్రి మహిళలు, గుడిసెవాసులు, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, పేదలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>