ప్రభుత్వ ఉన్నత ఉద్యోగానికి రాజీనామా.. ఎమ్మెల్సీ బరిలో శ్రీనివాస్ గౌడ్

‎కలం, నల్లగొండ: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అటవీ శాఖలో ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న యార్కల శ్రీనివాస్ గౌడ్ (Yarkala Srinivas Goud) తన పదవికి రాజీనామా చేసి, ప్రత్యక్ష ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించడంతో ప్రాంతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.

ఈ సందర్భంగా యార్కల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకగా నిలిచి వారి సమస్యలను సమర్థవంతంగా వినిపించడమే తన ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏళ్లకు తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఉద్యోగ భద్రత, విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, యువత భవిష్యత్తును సరిదిద్దే అంశాలపై తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సురక్షితమైన ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని ప్రజాసేవ వైపు అడుగులేస్తున్న యార్కల శ్రీనివాస్ గౌడ్ నిర్ణయం, ఎమ్మెల్సీ ఎన్నికల రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>