కలం, వెబ్ డెస్క్: ఏపీలో కొత్త పార్టీ ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కీలక ప్రకటన చేశారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి యువతనే సీఎం చేస్తానని వెల్లడించారు. బుధవారం విజయవాడలో ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (Parivartan Rajniti Party)ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. యువతను నాయకులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో కొత్త పార్టీని (PRP) ప్రారంభించినట్లు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతుల్లో లేదని చెప్పారు. 5 కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్ కుటుంబాల్లోని వారే సీఎం కావాలా? ఈ రెండు కుటుంబాల్లోని వారి నుంచే ఎంపీలు కావాలా? అని ఆయన (Vijayasai Reddy) ప్రశ్నించారు. భారీ తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉందో ఏపీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తన పవర్ ఏంటో చూపిస్తానని విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : సైబర్ మోసం: వృద్ధుడు దాచుకున్న సొమ్ము మాయం!
Follow Us On : WhatsApp

