సైనికుడిగా సల్మాన్ ఖాన్.. ‘మాతృభూమి’ ట్రైలర్ అదుర్స్!

కలం, వెబ్ డెస్క్: ఎన్నో అడ్డంకులు, మార్పుల తర్వాత బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన ‘మాతృభూమి’ (Maatrubhumi) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ (Trailer) ను విడుదల చేసింది. ఇందులో సల్మాన్ ఖాన్ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడిగా కనిపించారు. మరోవైపు భార్య, పిల్లలతో సంతోషంగా గడిపే కుటుంబ వ్యక్తిగానూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ కథానాయికగా నటిస్తూ సల్మాన్ భార్య పాత్రను పోషించారు.

2020లో భారత్, చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. తొలుత ఈ చిత్రానికి ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనంతరం ‘మాతృభూమి’గా పేరు మార్చారు. భారత రక్షణ మంత్రిత్వశాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా సినిమాలో దాదాపు 40 శాతం సన్నివేశాలను రీషూట్ చేశారు. కథలో కల్పిత అంశాలు, రొమాంటిక్ సన్నివేశాలు, పాత్రల నేపథ్యాలను జోడించి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>