కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు (Rakul Preet Singh Brother) అమన్ ప్రీత్ సింగ్ (Aman Preet Singh) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో నమోదైన డ్రగ్స్ కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశాడు. డ్రగ్స్ పెడ్లర్లతో తనకు సంబంధం లేదంటూ అమన్ పిటిషన్ లో పేర్కొన్నాడు. డ్రగ్స్ కొనుగోలు కేసులో అమన్ సింగ్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఈ కేసులో తరువాతి దర్యాప్తు చేపట్టకుకండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరాడు. దీనిపై తదుపరి వాచారణను హైకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. కాగా, డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ A7గా ఉన్నాడు.

Read Also: ఫ్యాన్ గర్ల్ తో ప్రభాస్ .. లేటెస్ట్ క్లిప్ వైరల్
Follow Us On: Sharechat


